Minister Ponguleti : పేదవారి సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుంది : మంత్రి పొంగులేటి

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponguleti : పేదవారి సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుంది : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : పేదవారి సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం(Indiramma's government)నెరవేరుస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. కూసుమంచిలో ఆయన మోడల్ హౌజ్ కు శంకుస్థానన చేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు విజయవంతమయ్యాయని ప్రజాపాలన లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి లబ్ధిదారుల గుర్తింపు కొనసాగుతోందని, ప్రజాపాలన లో దరఖాస్తు చేయని వారు స్పెషల్ కౌంటర్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసిన వారి కుటుంబ సభ్యులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం లో కండీషన్ లు పెట్టి ఇళ్లు ఇవ్వకుండా తప్పించుకునే ప్రభుత్వం కాదన్నారు.

ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారని, 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్ధించారని వెల్లడించారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి స్థలం ఫోటో తీసి యాప్ లో నమోదు చేస్తామని, ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 580 మోడల్ హౌజ్ లు నిర్మిస్తామని, సంక్రాంతి నాటికి కూసుమంచి లో మోడల్ హౌజ్ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇళ్లు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని, ఎవరు ఇళ్లు వారే నిర్మించుకునే విధంగా మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. పేదవారికి భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గ్రామాలకు సర్వేకు వచ్చే అధికారులు ఇందిరమ్మ కమిటీలను కలుపుకుని పోవాలని సూచించారు.

Advertisement

Next Story