- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కూతురైతేనే మహిళా కమిషన్ స్పందిస్తుందా?
దిశ, తెలంగాణ బ్యూరో: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి విషయంలో స్పందించని రాష్ట్ర మహిళా కమిషన్.. ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం వెంటనే స్పందించిందని తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కూతురు కవిత మాత్రమే మహిళనా.. ఇతర ఆడబిడ్డలు మహిళలు కాదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత సునీతా లక్ష్మారెడ్డి పైన ఉన్నదన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ నిన్నటి వరకు నిద్రలో ఉండి ముఖ్యమంత్రి కూతురును ఈడీ విచారణ చేయగానే మహిళా కమిషన్ మత్తు నుంచి మేల్కొని సుమోటో కేసు నమోదు చేసిందని విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.
2019లో ఏర్పడిన మహిళా కమిషన్ ఇప్పటివరకు ఒక సమస్యను పరిష్కరించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూన్న స్పందించలేదన్నారు. మెడికో ప్రీతి విషయంలో ఫిర్యాదు చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించిందని, కానీ రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటివరకు స్పందించలేదన్నారు. గతంలో గవర్నర్ పైన కూడా ఒక ప్రజా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు స్పందించి ఉంటే బాగుండేదని తెలిపారు. విమర్శలు రావడంతో సర్పంచ్ నవ్యను వేధించిన ఎమ్మెల్యే రాజయ్య కేసు గుర్తుకొచ్చిందని విమర్శించారు. పారదర్శకంగా పనిచేయాల్సిన వ్యవస్థలు ప్రభుత్వ అధికారాలకు ప్రలోభాలకు లోబడి పని చేస్తున్నట్టు తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.