తెలంగాణలో కాంగ్రెస్ జోరు తగ్గేదేలే! ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో కీలక విషయాలు

by Ramesh N |   ( Updated:2024-03-04 13:31:08.0  )
తెలంగాణలో కాంగ్రెస్ జోరు తగ్గేదేలే! ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్‌లో కీలక విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే తరహాలో సత్తా చాటబోతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్ ఒపినియన్ పోల్ సర్వే‌లో తెలిపింది.

ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్

మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 స్థానాలు... బీజేపీకి 5 పార్లమెంటు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని సర్వేలో పేర్కొంది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది. గత లోక్‌సభ ఎన్నికల 2019లో, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) 9 సీట్లు, బీజేపీ 4 మరియు కాంగ్రెస్ 3. ఏఐఎంఐఎం 1 సీటు గెలుచుకుందని తెలిపింది. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం రాష్ట్రంలోని కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యం సాధించవచ్చని అభిప్రాయపడింది.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య వార్!

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నడుస్తోందని ఇటీవల బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ మూడవ స్థానంలో పరిమితమవుతుందని ఆయన అన్నారు. ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వేలో తెలిపిన ప్రకారం కూడా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉందనే తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మాత్రం ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందని చెప్పుకొస్తున్నారు.

Advertisement

Next Story