India today survey : తెలంగాణలో మెజార్టీ MP స్థానాలు ఆ పార్టీకే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-21 06:21:45.0  )
India today survey : తెలంగాణలో మెజార్టీ MP స్థానాలు ఆ పార్టీకే..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణలోని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో తమ వాణి బలంగా వినిపించవచ్చు అని పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు తమకే దక్కుతాయని ధీమాతో ఉంది. పదేళ్ల తర్వాత అధికారం కోల్పోయిన బీఆర్ఎస్‌‌కు ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. అయితే తాజాగా ఇండియా టుడే సర్వే తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై సర్వే ఫలితాలను వెల్లడించింది. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అభిప్రాయపడింది.

కాంగ్రెస్ 10, బీజేపీ 3, బీఆర్ఎస్ 3, ఏఐఎంఐఎం 1 స్థానాలు గెలుచుకుంటాయని ఈ సర్వే వెల్లడించింది. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు గెలుచుకోగా ఒక స్థానం కోల్పోయి 3 స్థానాలు, 3 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఏకంగా 7 స్థానాలు మెరుగుపరుచుకుని 10 స్థానాలు, 9 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ 6 స్థానాలు కోల్పోయి 3 స్థానాలను పరిమితం అవుతుందని సర్వే అభిప్రాయపడింది. ఓటు షేర్ విషయానికి వస్తే కాంగ్రెస్ 41 శాతం, బీఆర్ఎస్ 29 శాతం, బీజేపీ 21 శాతం, ఎంఐఎం 3శాతం, ఇతరులు 6 శాతం దక్కించుకుంటాయని స్పష్టం చేసింది.

Read more : ఇండియా టుడే సర్వే ఫలితాలు విడుదల.. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Advertisement

Next Story

Most Viewed