- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్.. ఆన్‌లైన్‌లో టికెట్స్ అమ్మకం ఎప్పటి నుంచి అంటే?
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మరోసారి అంతర్జాజీయ ఆటకు వేదిక కానుంది. ఈనెల 18న నగరంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫస్ట్ ఇన్నింగ్స్, సాయంత్రం 5.45 నుంచి రాత్రి 9.15 వరకు రెండో ఇన్నింగ్స్ జరగనున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన మ్యాచ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈనెల 13 నుంచి మ్యాచ్ టిక్కెట్స్ అందుబాటులోకి వస్తాయని అన్నారు. గతంలో జరిగిన వివాదాల కారణంగా ఈసారి కేవలం ఆన్‌లైన్‌లోనే టిక్కెట్ల విక్రయం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోను ఆఫ్‌లైన్ విక్రయం జరగదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి 29417టిక్కెట్లు ఉండనున్నాయి. వీటిని 4 విడతలుగా విక్రయిస్తారు. 13, 14, 15, 16న ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో వ్యక్తికి 4 టిక్కెట్లు తీసుకునే ఛాన్స్ ఉంది. టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని ఫిజికల్ టికెట్ తీసుకోవాలని అజారుద్ధీన్ సూచించారు. మ్యాచ్ కోసం ఫిజికల్ టికెట్ తప్పనిసరి అని అన్నారు. వీటిని ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలిలో అమ్మకాలు జరుగుతాయని, ఐడీ కార్డు చూపించి టికెట్ తీసుకోవాలని తెలిపారు.