- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెట్రోలో భారీగా పెరిగిన ప్రయాణికుల రద్దీ
X
దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని బెంగళూరు ప్రజా రవాణా మెట్రో రైలు మొత్తం పర్పుల్ లైన్‌లో పూర్తి సేవలను ప్రారంభించిన తర్వాత ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బోగీలు సరిపోక ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కుంటున్నారు. కాగా, ఇటీవల ఒక్కరోజే 7 లక్షల మంది మెట్రోలో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. మెట్రో రోజువారీ బోర్డింగ్ అక్టోబర్ 2న 5 లక్షల నుంచి అక్టోబర్ 9 నాటికి 6.80 లక్షలకు పెరిగిందని బీఎంఆర్‌సీఎల్ వెల్లడించింది. అక్టోబర్ 13న 7.50 లక్షలు; అక్టోబర్ 18న 7.26 లక్షల మంది మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అయితే మెట్రో ప్రయాణికులు పలువురు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి బాధలు చెప్పుకుంటున్నారు. బెంగళూరు మరో ముంబాయి అయ్యిందని సెటైర్లు వేస్తున్నారు.
Advertisement
Next Story