- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఊరికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల...
దిశ, గజ్వేల్ రూరల్: రోజు రోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు అలాగే స్థానికంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డులో తాళం వేసిన ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు, 65 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్డులో నివాసముంటున్న రఘుపతి మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లాడు. శుక్రవారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని ఇంట్లో నుంచి ఆరు తులాల బంగారు ఆభరణాలతో పాటు, 65 వేల నగదును అపహరించుకు పోయినట్లు ఆయన తెలిపారు. వెంటనే గజ్వేల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం తో ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు గజ్వేల్ సీఐ సైదా తెలిపారు.