రైళ్ల సంఖ్యను పెంచండి : ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి

by M.Rajitha |
రైళ్ల సంఖ్యను పెంచండి : ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి
X

దిశ; తెలంగాణ బ్యూరో : భువనగిరి నియోజకవర్గం మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచడంతో పాటు హల్టింగ్ లకూ అవకాశం ఎక్కువ ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలోని ఆలేరు, జనగామ జిల్లా కేంద్రంలోని భువనగిరి స్టేషన్ లలో అదనపు హాల్టింగులు, ఫ్రీక్వెన్సిని పెంచాలని కోరారు. దీంతో పాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్ జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఆగడం లేదన్నారు. దీని వలన ఈ ట్రైన్ కోసం దాదాపు 70. కి.మీ ప్రయాణించాల్సి వస్తుందన్నారు. మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ కూడా భువనగిరి, ఆలేరు, జనగామ స్టేషన్‌లలో ఆగడం లేదన్నారు. ఇక కాకతీయ ట్రైన్ భువనగిరి స్టేషన్ కు ఉదయం 8 గంటలు లోపు వచ్చేలా టైమింగ్స్ మార్పులు తేవాలన్నారు. ప్రస్తుతం పది నుంచి 11 గంటల మధ్యలో వస్తుందని వివరించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు పుష్పల్ రైలు టైమ్ ప్రీక్వెన్సీని పెంచాలన్నారు. దీని వలన ఉద్యోగులు, విద్యార్ధులకు మేలు జరుగుతుందని వివరించారు.

Next Story

Most Viewed