శ్రీవారి లడ్డూ వివాదం.. ప్రధాని మోడీకి, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తా: సజ్జల

by srinivas |
శ్రీవారి లడ్డూ వివాదం.. ప్రధాని మోడీకి, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తా: సజ్జల
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం (Tirumala laddu controversy)పై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (YCP General Secretary Sajjala Ramakrishna Reddy) స్పందించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ పరీక్షల్లో లడ్డూలో కొవ్వు ఆనవాళ్లు లేవని, ఆవులు తినే ఆహారాన్ని బట్టి పాలల్లో ఆ లక్షణాలు ఉంటాయని తెలిపారు. పాలు, నెయ్యిని ముందుగానే టెస్ట్ చేసి తిరుమలకు పంపుతారని చెప్పారు. టెస్ట్ చేయకుండా ఎలాంటి అనుమతులు ఇవ్వరని, తేడా వస్తే వెనక్కి పంపుతారని సజ్జల పేర్కొన్నారు. ల్యాబ్ రిపోర్టులో నెగిటివ్ వచ్చినా చంద్రబాబు మాత్రం లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెబుతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. తిరుమలపై నమ్మకాన్ని పెంచాలంటే కల్తీ ఘటనపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ (Pm Modi), సుప్రీంకోర్టు జడ్జి(Supreme Court Judge)కి తాను లేఖ రాస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed