Atishi : కేజ్రీవాల్‌ను మళ్లీ సీఎం చేద్దాం.. ఢిల్లీ ప్రజలకు సీఎం అతిషి పిలుపు

by Hajipasha |
Atishi : కేజ్రీవాల్‌ను మళ్లీ సీఎం చేద్దాం.. ఢిల్లీ ప్రజలకు సీఎం అతిషి పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించి అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ అధికారంలోకి తేవాలని సీఎం అతిషి తన తొలి ప్రసంగంలో ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ తన మార్గ నిర్దేశకుడని ఆమె పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ స్థానంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి రావడం అనేది తనకు ఉద్వేగభరిత అంశమని అతిషి పేర్కొన్నారు.

ఢిల్లీ ప్రజల జీవితాలను మార్చిన ఘనత కేజ్రీవాల్‌కే దక్కుతుందని ఆమె కొనియాడారు. అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ సీఎం చేయడం కోసం ఆప్ శ్రేణులంతా ఇక కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. నీతి, నిజాయితీకి తార్కాణంగా నిలుస్తూ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారని అతిషి పేర్కొన్నారు. కాగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Next Story

Most Viewed