Coastal areas: తీర ప్రాంతాల్లో ఫిషింగ్ నెట్, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌లు

by Harish |   ( Updated:2024-09-21 14:13:56.0  )
Coastal areas: తీర ప్రాంతాల్లో ఫిషింగ్ నెట్, ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సముద్రంలో ప్రస్తుతం చేపలు పట్టే(ఫిషింగ్) నెట్, ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో తీర ప్రాంతాల్లో వీటి రీసైక్లింగ్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ శనివారం తెలిపారు. ముంబైలోని జుహూలో బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌లో పాల్గొన్న ఆయన, ఎవరైనా ఈ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వారికి ప్రభుత్వం వన్-టైమ్ ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొంటూ దానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించారు.

దేశంలో గ్లోబల్ పర్యావరణ, విద్యా, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండే 12 బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్‌లలో ఫిషింగ్ నెట్, మెరైన్ ప్లాస్టిక్ వేస్ట్ రీసైక్లింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ తీర ప్రాంతాల్లో 13 ఫిషింగ్ నెట్‌లు, 12 ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఒకే విడతలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఈ ప్లాంట్‌లను బీచ్‌లు, హార్బర్‌లు, ఫిషింగ్ హాట్‌స్పాట్‌లు, అధిక పర్యాటక ప్రాంతాలు, ఇతర వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలకు దగ్గరగా ఉండేలా ఏర్పాటు చేస్తారు.

వీటిని స్థాపించడానికి రిజిస్టర్డ్ మత్స్యకారుల సొసైటీలకు ముందుగా ప్రాధాన్యత ఇస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్ల కోసం, టన్ను ఉత్పత్తి సామర్థ్యంపై రూ. 19 లక్షలు లేదా ప్లాంట్ ధరలో 40 శాతం, గరిష్ట పరిమితి రూ. 38 లక్షలు గ్రాంట్ ఇస్తారు. నైలాన్ ఫిషింగ్ నెట్ రీసైక్లింగ్ యూనిట్ల కోసం, టన్ను కెపాసిటీకి రూ.24 లక్షలు లేదా ప్లాంట్ ఖర్చులో 40 శాతం, గరిష్టంగా రూ.48 లక్షలతో గ్రాంట్ అందిస్తారు.

Advertisement

Next Story

Most Viewed