మా జిల్లాను చార్మినార్ జోన్ లో కలపండి.. మరోసారి తెరపైకి జోన్ వివాదం

by Prasad Jukanti |   ( Updated:2024-02-16 12:24:48.0  )
మా జిల్లాను చార్మినార్ జోన్ లో కలపండి.. మరోసారి తెరపైకి జోన్ వివాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో:మెదక్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. రాజధాని హైదరాబాద్ సు అత్యంత సమీపంలో ఉన్న తమ జిల్లాను సిరిసిల్ల జోన్ లో కలిపారని దాని వల్ల జిల్లా యువకులు తీవ్రంగా నష్టపోతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీరో అవర్ లో మాట్లాడిన ఎమ్మెల్యే.. మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ లో కలపడం ద్వారా జిల్లా యువత తమకు ఉద్యోగాలు రావనే అభద్రతా భావంలో ఉన్నారని ఈ విషయంలో అన్ని పార్టీలు మొన్నటి ఎన్నికల్లో వాగ్దానం చేశాయని గుర్తు చేశారు. అందువల్ల ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా మెదక్ జిల్లాను సిరిసిల్లా జోన్ నుంచి చార్మినార్ జోన్ కు మార్చాలని ఇప్పటికే ఉద్యోగులు, నిరుద్యోగులు, యువత జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా గతంలో హైదరాబాద్ జోన్ లోనే ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జోన్లను మార్చింది. కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లాను చార్మినాన్ జోన్ కిందే ఉంచి, మెదక్, సిద్దిపేట జిల్లాలను రాజన్న సిరిసిల్ల జోన్ కోల కలిపారు. ఈ నిర్ణయం పట్ల మెదక్ జిల్లాకు యువత మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed