- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ కాంగ్రెస్ లో అందరి చూపు అక్కడే.. ఆ అదృష్టం దక్కేదెవరికో?
దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో తమకు తిరుగులేదని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలనే మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గెలిచే అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ లో ప్రముఖుల ఫోకస్ అంతా ఖమ్మం టికెట్ చుట్టే తిరుగుతుండటం చర్చకు దారి తీస్తోంది. కీలక నేతలంతా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖమ్మం స్థానాన్నే ఎంచుకోవడం హస్తం పార్టీలో ఖమ్మం టికెట్ హాట్ సీట్ గా మారింది. దీంతో ఖమ్మం టికెట్ పాలిటిక్స్ టీ కాంగ్రెస్ లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.
సోనియాకు అన్నారు.. అందరూ పోటీ పడుతున్నారు:
క్రమంలో ఖమ్మం టికెట్ కోసం పార్టీలో రోజు రోజుకు పోటీ పెరగడం చర్చకు దారితీస్తోంది. తాజాగా ఆశావహుల నుంచి పార్టీ అప్లికేషన్లు స్వీకరించగా ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమని మల్లు నందిని దరఖాస్తు చేసున్నారు. ఇక ఇదే స్థానం నుంచి తనకూ అవకాశం కావాలని సీనియర్ నేత వీహెచ్ సైతం అప్లికేషన్ పెట్టుకోవడం పార్టీలో ఆసక్తికంగా మారింది. వీరితో పాటు ఖమ్మం డీసీసీ చీఫ్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పోటీకి సిద్దంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఓ వైపు టికెట్ దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నంలో వారుంటే మరోవైపు ఖమ్మంలో పోటీ చేసే హక్కు తనకొక్కరికే ఉందని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఇప్పటికే తన తన మనసులోని మాటలు బయటపెట్టారు. ఇదిలా ఉంటే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సైతం ఖమ్మం స్థానం నుంచే పోటీ చేయబోతున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధినేత్రి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న స్థానం నుంచి ముఖ్యనేతలంతా టికెట్ కోసం పోటీ పడుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
గెలుస్తామన్నా ధీమాతోనేనా?:
ఖమ్మం పార్లమెంట్ స్థానం మొదటి నుంచి ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం హవా జోరుగా వీసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కీ రోల్ పోషించిన ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లోనూ హాట్ టాపిక్ అవుతున్నది. అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఖమ్మం లోక్ సభ స్థానం హస్త గతం కావడమే తరువాయి అన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతున్నది. గెలుపు పక్కా అనే అంచనాలతోనే ఈ టికెట్ కోసం నేతలంతా తమ వంతు ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారనే చర్చ తెరమీదకు వస్తోంది. ఒక వేళ ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ చేయని పక్షంలో ఆ టికెట్ ను దక్కించుకుంటే చాలు గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయంతోనే నేతలంతా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అంతిమంగా ఖమ్మం టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.