గ్రూప్-4 పరీక్షలో బలగం మూవీపై క్వశ్చన్.. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇదే..!

by Satheesh |   ( Updated:2023-07-01 09:31:45.0  )
గ్రూప్-4 పరీక్షలో బలగం మూవీపై క్వశ్చన్.. ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇదే..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సొంతం చేసుకున్న బలగం సినిమాపై కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌ల్లో తరచూ ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో బలగం సినిమాకు సంబంధించి ప్రశ్న అడుగగా.. తాజాగా శనివారం టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-4 (పేపర్-1 జనరల్ స్టడీస్) పరీక్షలో ఓ ప్రశ్న అడిగారు. 'బ‌ల‌గం చిత్రానికి సంబంధించి కింది జ‌త‌ల‌లో ఏవి స‌రిగ్గా జ‌త‌ప‌రిచిన‌వి?' ఎ. ద‌ర్శకుడు: వేణు యెల్దండి, బి. నిర్మాత: దిల్ రాజు, హ‌న్షితా రెడ్డి, హ‌ర్షిత్ రెడ్డి, సి.సంగీత ద‌ర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, డి. కొమ‌ర‌య్య పాత్రను పోషించిన‌వారు: అరుసం మ‌ధుసూధ‌న్‌. దీనికి సమాధానం ఏ, బీ, సీ కాగా బలగం సినిమాలో కొమరయ్య పాత్రను కేతిరి సుధాకర్ రెడ్డి పోషించారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది జరిగిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో 'మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో బలగం సినిమాకు ఏ విభాగంలో పురస్కారం లభించింది?' అనే క్వశ్చన్ అడిగారు. ఎ. ఉత్తమ డాక్యుమెంటరీ, బి. ఉత్తమ నాటకం, సి. ఉత్తమ దర్శకుడు, డి. ఉత్తమ సంభాషణ. దీనికి సమాధానం ఉత్తమ నాటకం. ఒకప్పుడు తెలంగాణ సినిమాలు అంటేనే చిన్న చూపు చూసిన పరిస్థితి నుండి ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తెలంగాణ మట్టి కథలు, తెలంగాణ జీవన కథలు ఉంటే చాలు హిట్ ఖాయం అనే స్థాయికి చేరింది. అలా వచ్చి బంపర్ హిట్ కొట్టిన సినిమాలో బలగం ఓ కొత్త ట్రెండ్ తీసుకువచ్చింది. తెలంగాణలోని అనేక పల్లెల్లో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు.

Advertisement

Next Story