Bandla Ganesh: భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు కమ్మవాడే! బండ్ల గణేష్ సంచలన స్పీచ్ వైరల్

by Ramesh N |   ( Updated:2024-07-21 12:01:35.0  )
Bandla Ganesh: భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడు కమ్మవాడే! బండ్ల గణేష్ సంచలన స్పీచ్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్తులో అమెరికా ప్రెసిడెంట్ ఒక కమ్మ వాడు అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ జోస్యం చెప్పారు. తాజాగా మాదాపుర్‌లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్‌లో ఆయన ప్రసంగించారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దేశ విదేశాల్లోని అన్ని ప్రాంతాలకు కమ్మ వాళ్లు విస్తరించారని చెప్పుకొచ్చారు.

బోరులో పడ్డ బయటకు రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మ వాడు అని ధీమా వ్యక్తం చేశారు. కమ్మ వాడికి మోసం, అన్యాయం చేయడం రాదని, కమ్మ వాడికి కష్ట పడటం ఒకటే వచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తాం.. కమ్మ వాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం.. అని అన్నారు. మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకొని సాయం చేయండని, అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని పిలుపునిచ్చారు. తమ కమ్యూనిటీలో కష్టపడే యువకులకు భవిష్యత్ ఇవ్వాలని సూచించారు.

రవి అస్తమించని ప్రతి దేశంలో కమ్మ వాడు జెండా ఎగరేస్తున్నాడన్నారు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు.. అవసరం అయితే సూట్ విప్పి నాటు వేసేవాడు.. ఆకాశం వైపు కసిగా చూసేవాడు.. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసే వాడు కమ్మ వాడన్నారు. కమ్మొడు అంటే కష్టపడే వాడు.. కమ్మొడు అంటే కసితో బతికే వాడు.. కమ్మొడు అంటే కడుపులో ఉన్నది తీసి పెట్టే వాడు.. కమ్మొడుఅంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లే వాడు అని బండ్ల పవర్‌ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు బండ్లగణేష్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Next Story