- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందుకే అధికారులపై దాడులు.. వీఆర్వో జేఏసీ సంచలన వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, తహశీల్దార్లపై జరిగిన అమానుష దాడిని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ(Village Revenue Officers JAC) ఖండించింది. ఈ దాడి కేవలం ప్రభుత్వ అధికారులపై మాత్రమే కాకుండా ప్రజాస్వామ్యంపై సవాల్ విసిరిన చర్యగా భావిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. కానీ, కక్షపూరిత దాడులు చేయడం, చట్టాన్ని తుంగలో తొక్కడం అస్సలు ఆమోదించలేనిదని జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్(VRO JAC Chairman Golkonda Sathish), సెక్రటరీ జనరల్ హరాలే సుధాకర్ రావు, అదనపు సెక్రటరీ జనరల్ పల్లెపాటి నరేష్, కో చైర్మన్ సురేశ్ లు అన్నారు.
గ్రామ రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల దాడులు పెరుగుతున్నాయన్నారు. గతంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు ఉన్నప్పుడు ఇలాంటి దాడులు జరగడం చాలా అరుదు. గ్రామాల్లో పరిస్థితులను గమనిస్తూ, ప్రభుత్వానికి సరైన నివేదికలు పంపడం ద్వారా అధికారులు ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉండేదన్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో గ్రామ స్థాయి రెవెన్యూ అధికారుల గైర్హాజరీ కారణంగా గ్రామాలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధం దెబ్బతిన్నదన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ(Village Revenue Officers) రద్దు చేసిన ప్రభావం వల్ల గ్రామ స్థాయి సమాచారం ప్రభుత్వానికి చేరడం లేదన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లేకుండా ఉండటం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను తొలగించి, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ప్రజలకు హాని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్ (Pharmacity Project) ద్వారా పరిశ్రమలు(industries), ఉపాధి అవకాశాలు(employment) మెరుగవుతాయని ఆశతో, భూ సేకరణలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం గ్రామాలకు వెళ్లిన అధికారులపై పక్కా కుట్రతో దాడి చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి రెవెన్యూ అధికారులపై దాడులకు ప్రేరేపించడం అసహ్యకరమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగుల పక్షాన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తపరచడానికి ప్రభుత్వం సృష్టించిన వేదికలను ఉపయోగించుకోవాలని, సదాశయపూర్వకంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.