వైద్యం వికటించి పసికందు మృతి.. గ్రామస్తుల ఆందోళన

by Vinod kumar |
వైద్యం వికటించి పసికందు మృతి.. గ్రామస్తుల ఆందోళన
X

దిశ, పిట్లం : వైద్యుని నిర్లక్ష్యంతో 15 రోజుల పసికందు మృతి చెందిన ఘటన పిట్లం మండల కేంద్రంలోని భవాని హాస్పిటల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామానికి చెందిన జైపాల్, అనిత దంపతుల నెల 15 రోజుల పసికందు మూత్రం, మలవిసర్జన రాకపోవడంతో భవాని హాస్పిటల్‌కు తీసుకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో డాక్టర్ రాజ్ కుమార్ మందులు రాసి అందులో ఓ మందును మూతడు బాలుడికి పోయాలని తెలిపాడని, మందు పోసిన కొద్దిసేపటికి బాలుడు విపరీతంగా ఏడుస్తూ.. మలవిసర్జన మూత్రం చేసుకున్నాడని పేర్కొన్నారు.

అనంతరం ఎలాంటి కలదిక లేకుండా పడిపోయాడని, దాంతో తాము నిద్రిస్తున్నడేమో అని అనుకున్నామని, కొంత సేపటి తరువాత మరణించినట్లు తెలిపారు. సంబంధిత డాక్టర్‌ను ఈవిషయంపై నిలదీయగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలిసీతెలియని వైద్యం చేసి పసికందు ప్రాణం తీశాడని ధ్వజమెత్తారు. డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్​ చేశారు.

Advertisement

Next Story