E Commerce: పండుగ సీజన్‌ ఒక్క వారంలో రూ. 55 వేల కోట్ల ఈ-కామర్స్ అమ్మకాలు

by S Gopi |
E Commerce: పండుగ సీజన్‌ ఒక్క వారంలో రూ. 55 వేల కోట్ల ఈ-కామర్స్ అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలవడంతో ఈ-కామర్స్ పరిశ్రమ భారీ అమ్మకాలను చూస్తోంది. పండుగల ఆఫర్ల కారణంగా ఒక్క వారం రోజుల్లో 6.5 బిలియన్ డాలర్ల(రూ. 55 వేల కోట్ల కంటే ఎక్కువ) అమ్మకాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు నమోదు చేశాయి. ఇది గతేడాది పండుగ సీజన్ కంటే 26 శాతం పెరిగింది. మొత్తం అమ్మకాల్లో మొబైల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, గృహోపకరణాలు, సాధారణ వస్తువుల అమ్మకాలు మూడొంతులు ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ కన్సల్టెన్సీ డేటామ్ ఇంటిలిజెన్స్ ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి మొదలైన వారం నుంచి అమ్మకాలు అంచనా వేసిన దానికంటే 55 శాతం పెరిగాయి. ఆన్‌లైన్ రిటైలర్లు, బ్రాండ్లు పండుగ సీజన్ ముగిసే సమయానికి 12 బిలియన్ డాలర్ల(రూ. 1.1 లక్షల కోట్ల) స్థూల సరుకుల విలువ(జీఎంవీ)ను సాధించవచ్చని అంచనా. జీఎంవీ అనేది పరిశ్రమ మొత్తం అమ్మకాలను సూచిస్తుంది. ఇది గతేడాది ఉన్న రూ. 81.6 వేల కోట్ల కంటే 23 శాతం అధికం. అమ్మకాల్లో ఎక్కువగా చిన్న పట్టణాలు, నగరాల్లో నమోదవుతున్నాయి. అలాగే ఈఎంఐ చెల్లింపులను ఎక్కువమంది ఎంచుకుంటున్నారని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed