- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ నిజంగా గుడ్డిదా? ఈ కార్యక్రమం ఏం చెప్తుందంటే...
దిశ, ఫీచర్స్ : లవ్ ఈజ్ బ్లైండ్ షో గురించి విన్నారా? ఇందులో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. ఒకరినొకరు చూసుకోకుండానే బ్లైండ్ డేట్ కు వెళ్తారు. చూడడానికి ఎలా ఉంటారనే ఆలోచన లేకుండా మానసికంగా కనెక్ట్ అవుతారు. అభిప్రాయాలు, అభిరుచుల ఆధారంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తిని చూడకముందే వారికి ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. నిశ్చితార్థం అయిన తర్వాతే మొదటిసారి ఒకరినొకరు చూసుకుంటారు. వివాహ ప్రయాణానికి సిద్ధమవుతారు. కాగా ఈ షో ప్రేమ, పెళ్లికి లుక్స్ నిజంగా ఇంపార్టెంటా కదా అనే అంశంపై చర్చకు దారితీసింది.
ఎమోషనల్, ఇంటలెక్చువల్ కనెక్షన్ తో లవ్ లో పడడం అనేది మంచిదే. కానీ ఫిజికల్ అప్పియరెన్స్ కూడా చాలా మందికి ముఖ్యమే. ఎందుకంటే ఈ కార్యక్రమంలో చాలా మంది కంటెస్టెంట్స్ తాము చూడకుండా ఎంచుకున్న వ్యక్తితో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నా.. తొలిసారి ప్రత్యక్షమైనప్పుడు డిజప్పాయింట్ అవుతున్నారు. సొసైటల్ స్టాండర్డ్స్ ప్రకారం అందంగా కనిపించడం లేదని (బ్యాడ్ లుకింగ్) ఇందుకు కారణం. కాగా నిజంగా ప్రేమ గుడ్డిదా అనే అంశాన్ని లేవనెత్తింది. మనసు కోరుకుంది ఓకే కానీ ఫిజికల్ అట్రాక్షన్, కెమిస్ట్రీ, షేర్డ్ వాల్యూస్ అన్నీ కలిస్తేనే ప్రేమ దీర్ఘకాలం ఉంటుందనేది వాస్తవం అంటున్నారు నిపుణులు.