Jp nadda: జార్ఖండ్, మహారాష్ట్రలోనూ క్లీన్ స్వీప్ చేస్తాం.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా

by vinod kumar |   ( Updated:2024-10-11 15:32:45.0  )
Jp nadda: జార్ఖండ్, మహారాష్ట్రలోనూ క్లీన్ స్వీప్ చేస్తాం.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో విజయం సాధించిన బీజేపీ త్వరలో జరగబోయే జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా దీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మోడీ నాయకత్వంపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దీనిని హర్యానా ప్రజలు రుజువు చేశారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలకు తగిన సమాధానం చెప్పారన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఎనిమిది శాతం ఓటింగ్ నుంచి 60 శాతానికి చేరుకుందని, అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని నొక్కి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుకు వారు సానుకూలంగానే ఉన్నారని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో ఉగ్రవాదం అదుపులో ఉందని, దేశం సురక్షితంగా ప్రయాణిస్తోందని కొనియాడారు.

Advertisement

Next Story