BWF Junior World C'ships : క్వార్టర్స్‌లో ముగిసిన భారత్ పోరాటం

by Harish |
BWF Junior World Cships : క్వార్టర్స్‌లో ముగిసిన భారత్ పోరాటం
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది. యువ షట్లర్లు తన్వి శర్మ, ప్రణయ్, ఆలీషా నాయక్ తృటిలో పతకాలను కోల్పోయారు. సెమీస్‌కు చేరుకుంటే కనీసం కాంస్యం దక్కేది. క్వార్టర్ ఫైనల్స్‌లో వారి జోరుకు బ్రేక్ పడింది. ఉమెన్స్ సింగిల్స్‌లో యువ సంచలనం తన్వి శర్మ పతకం సాధించాలనే కనిపించింది. కానీ, క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి క్సు వెన్ జింగ్ చేతిలో 13-21, 21-19, 21-15 తేడాతో ఓడిపోయింది. ఆలీషా నాయక్‌పై 18-21, 19-21 తేడాతో డాయ్ క్విన్ యి(చైనా) విజయం సాధించింది. మెన్స్ సింగిల్స్ ప్రణయ్ పోరాటానికి కూడా తెరపడింది. చైనాకే చెందిన వాంగ్ జి జున్ చేతిలో 21-9, 21-16 తేడాతో పరాజయం పాలయ్యాడు. వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఒక్క పతకం గెలవకపోవడం గమనార్హం. 2022లో శంకర్ సుబ్రమణియన్(రజతం), 2023లో ఆయుశ్ శెట్టి(కాంస్యం) పతకాలు గెలిచారు.

Advertisement

Next Story

Most Viewed