- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ చేతిలో ఘోర ఓటమి.. పాక్ టెస్టు కెప్టెన్ మసూదుపై వేటు?
దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వేటు వేయనున్నట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైన తర్వాత ఈ వార్త చక్కర్లు కొడుతోంది. గతేడాది నవంబర్‌లో మసూద్ పాక్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. అతని నాయకత్వంలో టెస్టు జట్టు దారుణంగా విఫలమైంది. ఒక్క టెస్టు కూడా గెలవలేదు. ఆసిస్ చేతిలో మూడు టెస్టుల సిరీస్, ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో రెండు టెస్టుల సిరీస్‌ను కోల్పోయింది. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో మసూద్‌ను తప్పించాలని పీసీబీ ఆలోచిస్తున్నట్టు పాక్ మీడియా పేర్కొంది. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ అతన్ని తప్పించాలని భావిస్తున్నట్టు తెలిపింది. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. ఇటీవల పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజామ్ తప్పుకున్న విషయం తెలిసిందే.