- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిసెంబర్‌లోనా? జనవరిలోనా!? ఎలక్షన్స్‌పై బీఆర్ఎస్‌లో టెన్షన్!
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులో జరుగుతాయా? జనవరిలో ఉంటాయా? అనే టెన్షన్ బీఆర్ఎస్ లీడర్లకు పట్టుకున్నది. మిజోరాం అసెంబ్లీకి ఎలక్షన్స్ నిర్వహించిన తర్వాతే ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ పోల్స్ నిర్వహించే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్స్ నెల రోజుల పాటు ఆలస్యంగా జరిగితే తమకు నష్టమనే భావనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది.
ముందుగా మిజోరం ఎన్నికలు
ఈ ఏడాది డిసెంబరు 17లోపు మిజోరం కొత్త అసెంబ్లీ కొలువుదీరాలి. అందుకోసం అక్టోబరు 5న ఫైనల్ ఓటరు లిస్టు విడుదలైన వెంటనే మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడదలయ్యే చాన్స్ ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మిజోరం ఎన్నికల పక్రియ నవంబరు రెండో వారంలో పూర్తి చేసిన తర్వాత ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు విడుదల చేసేవిధంగా ఈసీ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
2018 లో బీజేపీకి చేదు అనుభవం
మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2018లో ఒకేసారి షెడ్యూలు విడుదల చేసి పోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో పార్లమెంట్ శీతకాల సమావేశాలు ఉండటంతో మోడీ, అమిత్ షా ద్వయం ఎన్నికలపై సీరియస్‌గా ఫోకస్ పెట్టలేకపోయింది. దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. అందుకని ఈసారి శీతకాల సమావేశాల షెడ్యూలును మార్చుకోవడమో లేకపోతే మిజోరాం మినహా మిగతా నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలును మార్చడమో చేస్తారనే చర్చ ఢిల్లీ అధికార వర్గాల్లో జరుగుతున్నది.
జనవరిలో జరిగితే నష్టమే
ఇప్పటికే 115 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా, మెజార్టీగా సిట్టింగులకే మరోసారి అవకాశమిచ్చారు. దీంతో పార్టీ కేడర్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. చాలా మంది తాము పనిచేయమని మొండికేస్తున్నారు. వారిని బుజ్జగించడం పార్టీ పెద్దలకు పెద్ద సమస్యగా మారింది. అంతేకాకుండా ప్రజల్లోనూ పార్టీ పట్ల వ్యతిరేక పెరిగిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మిజోరాం అసెంబ్లీతో కాకుండా నెల రోజుల ఆలస్యంగా ఎన్నికలు జరిగితే కష్టాలు తప్పవని బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనలో ఉన్నారు. మిజోరం అసెంబ్లీకి ముందుగా ఎన్నికలు నిర్వహిస్తారనే వార్తలు తెలుసుకున్న బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ ఎన్నికల షెడ్యూలు ఎప్పుడు వేస్తారు అని ఆరా తీసేపనిలో పడినట్టు సమాచారం.
రాష్ట్రం అసెంబ్లీ కాలపరిమితి
మిజోరం డిసెంబరు 18, 2023
ఛత్తీస్ గఢ్ జనవరి 4, 2024
మధ్యప్రదేశ్ జనవరి 7, 2024
రాజస్థాన్ జనవరి 15, 2024
తెలంగాణ జనవరి 17, 2024