- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం సొంత జిల్లాలో దారుణం.. శవంతో వాగు దాటేందుకు ప్రజల కష్టాలు
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శవంతో వాగు దాటేందుకు ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం వేచరిణి గ్రామంలో బాలయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అతడి అంత్యక్రియలు చేయడానికి బంధువులు, స్థానికులు బయలుదేరారు. అయితే ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో స్థానికంగా ఉన్న వాగు ఉప్పొంగుతోంది. అయితే స్మశాన వాటిక వాగుకు అవతలిపక్క ఉండటంతో బంధువులు నానా తంటాలు పడి వాగు దాటుకుంటూ వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. ‘‘సీఎం సొంత జిల్లాలో ప్రజలు శవంతో వాగు దాటడం దురదృష్టకరం. కేబుల్ బ్రిడ్జిలు కట్టాం, ఫ్లై ఓవర్లు కట్టామని గొప్పలు చెప్పుకునే గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు’’ అంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అయితే ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. అక్టోబర్‌లో ఒప్పందం ఉండటంతో పనులు అప్పుడే మొదలవుతాయని అంటున్నారు.