- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గాంధీభవన్‌లో జానారెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీ కాంగ్రెస్ మరింత దూకుడు పెంచుతోంది. నేతలను చేర్చుకోవడంతో పాటు అభ్యర్థుల జాబితా విడుదల చేయడంపై దృష్టి పెట్టింది. దీంతో పాటు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతలు వేరే పార్టీ వైపు వెళ్లకుండా ముందు నుంచే బుజ్జగింపు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు జానారెడ్డి అధ్యక్షతన నలుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేసుకునేందుకు ఈ కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.
బుధవారం గాంధీభవన్‌లో ఫెర్‌మెన్ కమిటీ తొలిసారి భేటీ అయింది. జానారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికలో సమస్యలు ఉన్న నియోజకవర్గాలపై చర్చిస్తున్నారు. టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో నేతలను బుజ్జగించడం, అభ్యర్థుల ఎంపికను ఒక కొలిక్కి తీసుకురావడంపై ఈ కమిటీ చర్చిస్తోంది.