అధికారులు లేకపోవడంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-12 05:50:59.0  )
అధికారులు లేకపోవడంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : గోషామహల్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బంది కొరత అక్రమ నిర్మాణదారులకు వరంగా మారింది. ఈ సర్కిల్ అక్రమ నిర్మాణాలకు పెట్టింది పేరు. అధికారుల పర్యవేక్షణ ఉన్న సమయంలోనే నిర్మాణదారులు విచ్చల విడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తుంటారు. దీంతో గతంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు తరచుగా అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు ఈ విషయంలో నగర మంత్రులు సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గ్రేటర్ పరిధిలోనే ఈ సర్కిల్‌లో నిర్మాణాలు జోరుగా కొనసాగుతుంటాయి. పాత భవనాలను కూల్చివేయడం, వాటి స్థానంలో నిర్మించే కొత్త భవనాలకు అనుమతులు తీసుకోకపోవడం వంటివి సర్వ సాధారణంగా మారిపోయాయి.

ముగ్గురికి ఒక్కరు కూడా లేరు..

గోషామహల్ సర్కిల్‌లో మొత్తం ఐదు వార్డులుండగా కనీసం ముగ్గురు సెక్షన్ ఆఫీసర్లు పని చేయాలి. కానీ పూర్తి స్థాయిలో అధికారుల కేటాయింపు జరగలేదు. సుమారు మూడేళ్ల క్రితం వరకు ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు ఇక్కడ విధులు నిర్వహించేవారు. అనంతరం ఒకరిని బదిలీ చేయడంతో గత నెల వరకు ఒక్కరే పని చేశారు. సదరు సెక్షన్ అధికారికి పదోన్నతి రావడంతో ఇక్కడి నుండి వెళ్లిపోయారు. నాటి నుండి ఇక్కడ సెక్షన్ అధికారి లేకుండా పోయారు. ఏసీపీ ఉన్నప్పటికీ ఉన్నతాధికారులతో సమావేశాలు, కార్యాలయం పనుల కారణంగా ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయలేని పరిస్థితి నెలకొంది . దీంతో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి .

నిలిచిపోతున్న అనుమతులు...

సిబ్బంది కొరత నిబంధనల మేరకు నిర్మాణాలు చేసుకునే వారిపై కూడా ప్రభావం చూపుతోంది. నూతనంగా నిర్మా ణాల అనుమతుల కోసం అప్లై చేసుకున్న వారి దర ఖాస్తును పరిశీలించిన అనంతరం క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించాలి. నిర్మాణం జరుగుతున్న సమయంలో తనికీ చేసి దరఖాస్తులో కోరిన మేరకే అంతస్తులు నిర్మిస్తున్నారా పరిశీలించాలి. ఒకవేళ అక్రమంగా అంతస్తులు నిర్మిస్తే వారికి నోటీసులు జారీ చేసి కూల్చి వేయాలి. అయితే సర్కిల్ లో ఒక్క సెక్షన్ ఆఫీసర్ కూడా లేకపోవడంతో ఇలాంటివేమీ ముందుకు సాగడం లేదు. దరఖాస్తు చేసుకున్న వారు, చేయని వారు అక్రమంగా భవనాలు నిర్మిస్తు న్నారు. కొంతమంది కార్యాలయం చుట్టూ అనుమ తుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. చైన్ మెన్లు ఉన్నా వారిలో కొంత మంది సెలవులు పెట్టడం , ఉన్నవారు కూడా కోర్టు కేసులు, ప్రధాన కార్యాల యం, జోనల్ కమిషనర్ కార్యాలయాలలో పనుల నిమిత్తం వెళ్తుండడంతో నూతన అనుమతులు, అక్రమ నిర్మాణాల తనిఖీలు పెండింగ్ పడుతు న్నాయి.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి

జీహెచ్ఎంసీ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న సెక్షన్ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని పలువురు ఉన్నతాధికారులను కోరుతున్నారు. అక్రమ భవనాల నిర్మాణాలను నియంత్రించడం, నూతనంగా నిబంధనల మేరకు నిర్మాణాలు జరిపే వారి ఇబ్బందులు తొలగించడం కోసం ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read.

పదేళ్ల పగ.. ప్రత్యర్థుల చేతిలో వ్యక్తి దారుణ హత్య

Advertisement

Next Story