IIIT Basar : ఐదవ స్నాతకోత్సవం చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్

by Sathputhe Rajesh |
IIIT Basar : ఐదవ స్నాతకోత్సవం చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్
X

దిశ, ముధోల్ : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసరలో శనివారం ఐదవ స్నాతకోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. డైరెక్టర్ సతీష్ కుమార్,ప్రొఫెసర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి వేడుకలకి ముఖ్యఅతిథులుగా ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఉన్నత విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రా రెడ్డి, దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు. శనివారం ఉదయం 9:30కు ఆర్జీయూకేటీ బాసరకు వారు చేరుకుంటారని పేర్కొన్నారు.

అనంతరం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గల కాన్ఫరెన్స్ హాల్‌లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా యూనిఫామ్స్, లాప్టాప్స్, షూలను(బూట్లు) విద్యార్థులకు అందిస్తామన్నారు. బ్రాంచ్‌ల వారీగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 38 బంగారు పథకాలను అందచేస్తారని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులు ప్రసంగించనున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించి పనులన్నీ పూర్తయ్యాయన్నారు. ఈ స్నాతకోత్సవంలో 576 మంది విద్యార్థులు తమ డిగ్రీ పట్టాలు తీసుకునేందుకు వస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, పోలీసులు, తదితరులకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed