- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రేవంత్ రెడ్డికి ఆగస్టు సంక్షోభం తప్పదు'..బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హాట్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి బీజేపీని నిలువరించే ప్రయత్నాలను చేసినా తెలంగాణ ప్రజలు మోడీ పక్షానే నిలిచారని ఓటింగ్ సరళిని బట్టి అర్థం అవుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా.కె. లక్ష్మణ్ అన్నారు. వీరీ కుట్రలను ప్రజలు విశ్వసించలేదన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. లోక్ సభ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి నేల విడిచి సాము చేసి అలవిగాని హామీలు ఇచ్చారని, దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం అని, తమ అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో కలవడం పక్కా అని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడే బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ సోనియా గాంధీని కాళ్ల ముందు మోకరిల్లిన సంగతి తెలంగాణ సమాజానికి తెలుసని అయితే అధికార దాహంతో విడిగా పోయిన విషయం ప్రజలకు మర్చిపోలేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి జైలులో ఉన్న నేతల కూటమే ఇండికూటమి అని సెటైర్ వేశారు. కేంద్రంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.
తెలంగాణలో బీజేపీ బలమైన శక్తి:
బీఆర్ఎస్ చచ్చిన పాము అని ఆ పార్టీకి ఎంత జాకీలు పెట్టి లేపినా పైకి లేవదన్నారు. కుటుంబ పాలన నిర్వాకం వల్ల ప్రజలు విసుగు చెందారని అందువల్లే ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేకపోగా కనీసం డిపాజిట్లు దక్కించుకోవడమే ఆ పార్టీకి గగనంగా మారిందన్నారు. రాజకీయంగా బీజేపీ తెలంగాణలో శక్తివంతమైన పార్టీగా మారబోతున్నదని భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ రాబోతున్నదని చెప్పారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తూ ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలల్లోనే 16 వేల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. ఈ ఐదు నెలల్లోనే విద్యుత్ కోతలు, సాగునీటిపై స్పష్టత లేదన్నారు. కాళేశ్వరం, ధరణి అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో ముందడుగు వేయకపోగా ధరణిలో అక్రమాలకు పాల్పడిన వారిని కాంగ్రెస్ లో చేర్చుకుని పునీతులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రిజర్వేషన్ల విషయంలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించలేదన్నారు. ఫేక్ వీడియో తయారు చేసిన రేవంత్ రెడ్డి ఫేక్ సీఎం అని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సహకరించిన కార్యకర్తలకు, ప్రజలకు, మీడియాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.