పరీక్షలు పూర్తయితే జాబ్ రాని వారు మరో ఉద్యోగం చూసుకుంటారు: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
పరీక్షలు పూర్తయితే జాబ్ రాని వారు మరో ఉద్యోగం చూసుకుంటారు: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత నెలరోజులుగా గ్రూప్-1, గ్రూప్-2 తో పాటు డీఎస్సీనీ వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షల వాయిదాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం జేఎన్టీయూలో క్వాలిటీ విద్యపై జరిగిన సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగులకు గత పది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక ఇబ్బందులు పడ్డారని.. తమ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు విడుదలై పరీక్షలకు సిద్ధం అవుతుంటే.. కొంతమంది కుట్ర చేస్తున్నారన్నారు. కొన్ని రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కుట్రపన్ని పరీక్షలు వాయిదా వేయాలని దీక్షలు చేస్తున్నారు. ఇందుకోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తాము పరీక్షలను వాయిదా వేయబోమని.. ఈ నోటిఫికేషన్ పరీక్షలు పూర్తయితే ఉద్యోగం రాని వారు మరో ఉద్యోగం చూసుకుంటారని అన్నారు. అలాగే తమ ప్రభుత్వం యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ నిర్వహణకు కసరత్తు చేస్తోందని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.



Next Story