- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఆనాడు స్పందించి ఉంటే.. ఈనాడు విలువ ఉండేది హరీష్!.. హరీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: ఆనాడు మాట్లాడి ఉంటే.. ఈనాడు నీ మాటకు విలువ ఉండేదని, ఎదుటివారిని వేలెత్తి చూపిస్తే నాలుగు వేళ్లు మన వైపుంటాయని హరీష్ తెలుసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ట్వీట్ కు గత ప్రభుత్వంలో జరిగిన ఘటనలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికను ఒక దుర్మార్గుడు గంజాయి మత్తులో అతి కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసిన నాడు కానీ, పెద్దమగుడి సమీపంలో మత్తులో కొందరు యువకులు విదేశీ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నాడు హరీష్ రావు ఇలాగే స్పందించి ఉంటే ఆయన చిత్తశుద్ధిని శంకించేవాళ్లం కాదని మండిపడింది.
అలాగే మరియమ్మ అనే దళిత మహిళను యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్ చేసిన నాడు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు తప్పతాగి ప్రగతి భవన్ ముందే ప్రమాదం చేసి, తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతికిన నాడు, 16 కోట్లు ఇవ్వకపోతే మీరు తెలంగాణలో వ్యాపారం ఎట్లా చేస్తారో చూస్తా అని ఒక పారిశ్రామికవేత్తను కల్వకుంట్ల కవిత బెదిరించిన నాడు ఇదేం లా అండ్ ఆర్డర్ అని హరీష్ రావు ప్రశ్నించి ఉండాల్సిందని అన్నారు. అంతేగాక ఆయన సొంత జిల్లా సిద్ధిపేటలో మల్లన్న సాగర్ బాధితులను పోలీసు లాఠీలతో తలలు పగలగొట్టించిన నాడు, నేరేళ్లలో అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారన్న నెపంతో దళిత, బీసీ యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన నాడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీ వందిమాగధ అధికారగణం భూ సెట్ల్మెంట్లకు తెగబడిన నాడు ఇది తప్పు అని హరీష్ రావు ప్రశ్నించి ఉంటే ఇవ్వాళ ఆయన చిత్తశుద్ధిని శంకించేవాళ్లం కాదని రాసుకొచ్చింది.
ఇక కొత్తగూడెంలో నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు నిర్వాకం, కీచకపర్వంతో ఒక నిండు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న నాడు ఇది దుర్మార్గం అని, పోడు భూముల్లో పేదరైతులు, రంగనాయక సాగర్ లో బీద రైతులను కొట్టి, బెదిరించి భూములు లాక్కున్ననాడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గురించి హరీష్ రావు మాట్లాడి ఉంటే ఇవ్వాళ ఆయన మాటకు విలువ ఉండేది అని చెప్పుకొచ్చింది. ఎదుటివారి వైపు వేళ్లెత్తి చూపేటప్పుడు మన వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయని హరీష్ తెలుసుకుంటే మంచిది అని సూచించారు. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కఠినంగా ఉన్నారని, పైన మేం చెప్పిన ఏ ఘటనలోనూ కేసీఆర్ స్పందించగా తెలంగాణ చూడలేదు. కానీ, రేవంత్ రెడ్డి గారు బాలికపై అత్యాచారం గురించి తెలియగానే ఎస్సై, సీట్లను సస్పెండ్ చేశారని, ఆ కుటుంబానికి అండగా నిలవడం కోసం మంత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గార్లను స్వయంగా పంపారని తెలిపారు. రాష్ట్రానికి మీరు అంటించిపోయిన మత్తు జాఢ్యాన్ని వదిలించడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారని, డ్రగ్స్ అనే మాట వినబడటానికి వీలు లేదని పోలీసులకు లక్ష్యాన్ని నిర్ధేశించి ఛైతన్యపు సమాజ నిర్మాణానికి పునాదులు వేస్తున్నారని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.