Jeff Bezos: మళ్లీ పెళ్లికి సిద్ధమైన జెఫ్ బెజోస్

by S Gopi |
Jeff Bezos: మళ్లీ పెళ్లికి సిద్ధమైన జెఫ్ బెజోస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ సంపన్నుడు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్నారు. 60 ఏళ్ల వయసున్న బెజోస్ లేటు వయసులో ప్రియురాలు లారెన్ శాంచెజ్‌ను వివాహం చేసుకోనున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా వీరిద్దరూ ఒకటి కానున్నారని, అయితే కొద్దిమంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. గతేడాదిలోనే వీరి నిశ్చితార్థం అయినట్టు, ఖరీదైన వజ్రాల ఉంగరాన్ని బెజోస్ కానుకగా ఇచ్చినట్టు కథనాలు వెలువడ్డాయి. 54 ఏళ్ల లారెన్ శాంచెజ్ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. 2018 నుంచే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం ఉంది. ఆ తర్వాత ఏడాది వరకు ఈ వ్యవహారం బయటకు తెలీదు. 2019లో బెజోస్ తన భార్య మెకంజీతో విడాకులు తీసుకున్నారు. లారెన్‌కు ఇదివరకు పాట్రిక్ వైట్‌సెల్ అనే వ్యక్తిగా వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలున్నారు. అంతేకాకుండా మాజీ ఎన్ఎఫ్ఎల్ ప్లేయర్ టోనీతో ఓ కుమారుడికి జన్మనిచ్చారు.

Advertisement

Next Story