మరికొద్ది గంటల్లో ఏపీ కేబినెట్ సమావేశం

by Mahesh |
మరికొద్ది గంటల్లో ఏపీ కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం(Cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో 43వ సీఆర్‌డీఏ అథారిటీ(CRDA Authority) సమావేశంలో ఆమోదం తెలిపిన రూ.24,276 కోట్ల విడుదలకు ఏపీ కేబినెట్(AP Cabinet) ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో మాఫియాగా మారి.. పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ (PDS Rice Smuggling)కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పీడీఎస్‌ రైస్‌ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వంపై కావాలని పనిగట్టుకుని సోషల్ మీడియా విష ప్రచారం, సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనున్నారు. వీటితో పాటు పెట్టుబడుల(Investments) అంశంపై ఏపీ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది.

Advertisement

Next Story

Most Viewed