- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోరుగడ్డ వ్యవహారంలో మరో నలుగురు పోలీసులు ఔట్
దిశ ప్రతినిధి, గుంటూరు: బోరుగడ్డ అనిల్.. ఒకప్పుడు వైసీపీలో అతను మాట్లాడిందే వేదం. ఇప్పుడు పలు కేసులలో నిందితుడిగా ఉంటూ, పోలీసులపై పెత్తనం చెలాయిస్తున్నాడు.అతని వ్యవహారంలో ఇప్పటి వరకు ఓ సీఐ, 11 మంది పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. కొద్ది రోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తూ గన్నవరం వద్ద రెస్టారెంట్‌లో అతనితో పాటు ఎస్కార్ట్ పోలీసులు విందులో పాల్గొనడం తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
సీమ అధికారే కారణమా..
తాజాగా, గుంటూరు అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో బోరుగడ్డకు రాచమర్యాదలు, మైనర్ అయిన మేనల్లుడు అర్థరాత్రులు పోలీసు స్టేషన్‌కు వచ్చి మట్లాడిన వీడియోలు బయటపడటంతో వివాదం మరింత పెరిగింది. దీంతో నలుగురు పోలీసులను గుంటూరు ఎస్పీ సస్పెండ్ చేశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత పోలీసు ఉన్నతాధికారుల్లో మార్పులేకపోడం పోలీసు బాస్‌కు ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. దీనంతటికీ రాయలసీమ నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చిన అధికారి కారణమని వస్తున్న ప్రచారంపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. త్వరలో సదరు అధికారిపై వేటు వేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.