Hyderabad : అర్థరాత్రి గన్ తో యువకుల హాల్ చల్

by M.Rajitha |
Hyderabad : అర్థరాత్రి గన్ తో యువకుల హాల్ చల్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లో కొంతమంది యువకులు గన్ తో రెచ్చిపోయారు. అర్థరాత్రి గన్స్ చేతపట్టి రోడ్లపై వీరంగం సృష్టించారు. కొద్ది రోజుల క్రితం బాచుపల్లిలోని స్పోర్ట్స్ క్లబ్(Bachupalli Sports Club) వద్ద కొంతమంది యువకులు తుపాకులతో రోడ్లపై తిరిగారు. వాహనదారులను, పాదాచారులను గన్ తో బెదిరిస్తూ వీరంగం చేయగా.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించినా.. సకాలంలో స్పందించలేదని వాపోయారు. అయితే ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో యువకులకు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, వారు ఎవరనే దానిపై విచారణ కొనసాగుతోంది. సీసీటీవీల్లో రికార్డయిన దృశ్యాలు బయటికి రావడంతో మరోసారి ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. రోజులు గడుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పోలీసులు కావాలనే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని సామాన్యులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed