- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 14 లోపు ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే చెల్లదా? క్లారిటీ ఇదే
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన కానుంచి ఎన్నో పుకార్లు వైరల్ అవుతూ జనాలను అయోమయంలో పడేస్తున్నాయి. దీంతో చాలా మంది వాటిని నమ్మి జనాలు కంగారు పడిపోతున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పలు హామీలు నెరవేర్చిన సంగతి తెలిసిందే. ఇందులో మహాలక్ష్మి పథకం ఒకటి. దీనికి మహిళలు, ట్రాన్స్ జెండర్స్, యువతులు ఆధార్ కార్డ్ చూపించి ఫ్రీ టికెట్ తీసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే గత కొద్ది కాలంగా ప్రతి దానికి ఆధార్డ్ కార్డును పరిగణలోకి తీసుకుని కచ్చితంగా చూస్తున్నారు. అయితే మహాలక్ష్మీ స్కీమ్ వచ్చిన కానుంచి పలు రకాల పుకార్లు ఎక్కువయ్యాయి.
ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే ఫ్రీగా ప్రయాణించలేరని ఎన్నో పుకార్లు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆధార్ కార్డు చేసుకోకపోతే కార్డులు చెల్లకుండా పోతాయని ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో జనాలంతా టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, UIDAI క్లారిటీ ఇచ్చింది. ఆధార్ వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చిన అలాగే ఈ గడువును జూన్ 14 వరకు పొడిగించామని తెలిపారు. అలాగే ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోనప్పటికీ కార్డులు చెల్లుతాయని వెల్లడించారు. సోషల్ మీడియాలో వచ్చే వందంతులు నమ్మకండంటూ ప్రజలకు కాస్త ఊరటనిచ్చారు.
- Tags
- Aadhaar cards