సమగ్ర కులగణన చేపట్టకపోతే ఆమరణ దీక్షలు : టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్

by Y. Venkata Narasimha Reddy |
సమగ్ర కులగణన చేపట్టకపోతే ఆమరణ దీక్షలు : టీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్
X

దిశ వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన చేపట్టి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (టీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు బారి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడూతూ ప్రభుత్వాలు ఉద్ధేశపూర్వకంగానే బీసీలను అన్ని రంగాల్లో అణిచివేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీలే విద్యా, ఉద్యోగాల్లో నష్టపోతునారన్నారు. వెంటనే సమగ్ర కులగణన చేపట్టి ఎవరి జనాభా దామాషా వారికి రిజర్వేషన్లు వర్తింప చేయాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు జనాభా దామాషా రిజర్వేషన్లతో పాటు కామారెడ్డి డిక్లరేషన్‌ను పూర్తిగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వం మా డిమాండ్ల పట్ల స్పందించకపోతే ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆమరణ దీక్షలకు దిగుతామని, మరో తెలంగాణ ఉద్యమం లాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తదని హెచ్చరించారు. బీసీలను వంచించే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వంపై పోరుకు అన్ని ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు , మేధావులు కలిసిరావాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు టీఎస్పీ ఓయూ కన్వినర్ నూకల మధు యాదవ్, బీసీ సంఘం నేత పవన్ వర్మ, తెరిసా, మహేష్ గౌడ్, శ్రీకాంత్,కిరణ్‌, నరేష్ , విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed