- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ కేటాయింపుల్లో విచారణ 27కు వాయిదా
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య ఐఏఎస్, ఏపీఎస్‌ల కేడర్ కేటాయింపుల్లో నెలకొన్న వివాదంపై హైకోర్టు విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది. డీజీపీ అంజనీ కుమార్ సహా 13 మంది బ్యూరో క్రాట్ల క్యాడర్ కేటాయింపునకు సంబంధించిన వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. 2016లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ 2017లో డీవోపీటీ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించింది.
ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన బ్యూరో క్రాట్లు తెలంగాణలో కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కేసును లీడ్ కేసుగా స్వీకరించిన హైకోర్టు.. ఆయన ఏపీకి వెళ్లాల్సిందేనని తీర్పునిచ్చింది. ఈ క్రమంలో మిగతా అధికారుల కేసులు ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
ట్రిబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువచించిందని అభిప్రాయపడిన సీజే.. అన్ని పిటిషనన్లను రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని సూచించారు. ఈ సందర్భంగా కేసులో వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని అధికారుల తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 27కు వాయిదా వేసింది. కాగా ఈ అధికారుల జాబితాలో ప్రస్తుత డీజీపీ అంజనీకుమార్ మరో ఐపీఎస్ అధికారిణి అభిలాష్ భిస్త్‌ను, ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఎం.ప్రశాంతి, అనంత రాములు తదితరులు ఉన్నారు.
Also Read...
హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్ వార్.. కత్తులతో నడిరోడ్డుపై హల్ చల్