- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amoy Kumar: రెండో రోజు ఈడీ విచారణకు అమోయ్ కుమార్.. నిన్న వెంట లాయర్.. నేడు..
దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు గతంలో కలెక్టర్ గా పని చేసిన సమయంలో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, అసైన్డ్, సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అమోయ్ కుమార్ ను ప్రశ్నిస్తున్నది. ఈ మేరకు నోటీసులు ఇచ్చిన ఈడీ బుధవారం సుదీర్ఘంగా విచారించింది. సుమారు ఎనిమిదిన్నర గంటల పాటు ఆయనపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురింపించారు. రెండో రోజైన గురువారం సైతం విచారణకు రావాలన్న ఈడీ నోటీసుల నేపథ్యంలో ఆయన ఇవాళ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్నటి విచారణకు తన న్యాయవాదితో పాటు ఈడీ కార్యాలయానికి వచ్చిన అమోయ్ కుమార్.. ఇవాళ మాత్రం ఒంటరిగానే విచారణకు హాజరయ్యారు. అలాగే ఇవాళ్టి విచారణకు తన వెంట పలు పత్రాలను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వాటిని ఈడీ ప్రత్యేక బృందం పరిశీలించబోతున్నది. నిన్న సుదీర్ఘంగా విచారించిన ఈడీ ఇవాళ ఎంత సేపు ప్రశ్నించబోతున్నది? ఏయే అంశాలపై ఆరా తీయబోతున్నది? అనేది ఉత్కంఠగా మారింది.