CM Revanth Reddy : విద్యార్ధులకు అన్నగా తోడుంటా : సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-15 05:56:14.0  )
CM Revanth Reddy : విద్యార్ధులకు అన్నగా తోడుంటా : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ విద్యార్థుల(Students)సర్వతోముఖాభివృద్ధికి, సంక్షేమానికి అన్నగా తోడుంటానని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త మెనూ ప్రకటించిన సందర్భాన్ని ఆయన ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. అన్నగా తోడుంటా..ఆత్మ విశ్వాసాన్నిచ్చే సేవకుడవుతా..రేపటి తెలంగాణను నిర్మించే..ఈ బిడ్డల భవితను..నిర్మించే శ్రామికుడవుతానని ట్వీట్ చేశారు.

గురుకులాలు, హాస్టళ్లలో ఎదురవుతున్న నాసిరకం భోజనం, ఫుడ్ పాయిజన్ ఘటనలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలను 40శాతం పెంచడంతో పాటు తాజాగా ఏటా రూ.470కోట్ల ఖర్చుతో కొత్త మెనూ ప్రకటించింది. రోజు ఉదయం రెండు అల్పాహారాలు, మధ్యాహ్నం సన్నబియ్యంతో వండిన అన్నంతో కలిపి ఏడురకాల పదార్ధాలు, గుడ్డు, నెలకు ఆరుసార్లు మాంసహారంతో కూడిన భోజనం అందించేలా ప్రభుత్వం కొత్త మెనూ ప్రకటించింది. దీంతో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్భా విద్యాలయాల్లో చదువుతున్న 8లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త మెనూ పట్ల విద్యార్ధుల్లో, తల్లిదండ్రుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed