కౌశిక్ రెడ్డి పిలిస్తేనే ఆయన ఇంటికి వెళ్ళాను : అరికెపూడి గాంధీ

by M.Rajitha |
కౌశిక్ రెడ్డి పిలిస్తేనే ఆయన ఇంటికి వెళ్ళాను : అరికెపూడి గాంధీ
X

దిశ, వెబ్ డెస్క్ : గురువారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటివద్దకు తెలంగాణ పీఏసీ (TPAC) ఛైర్మన్ అరికెపూడి గాంధీ చేరుకోవడం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నేతలకు చెందిన కార్యకర్తల తోపులాటలో.. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కౌశిక్ రెడ్డి ఇంటిమీద రాళ్ళు, కోడిగుడ్లు విసిరారు. ఘర్షణపూరిత వాతావరణం నుండి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినప్పటికీ వినకపోవడంతో నార్సింగ్ పోలీసులు అరికెపూడి గాంధీని అరెస్ట్ చేయగా.. సాయంత్రం బెయిల్ పై విడుదల అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనను కౌశిక్ రెడ్డి ఇంటికి రమ్మని పిలిస్తేనే వెళ్లానని.. అక్కడికి వెళ్ళాక బీఆర్ఎస్ కార్యకర్తలు గుండాల్లా వ్యవహరించి మాపై దాడికి దిగారని అన్నారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రాంతీయ విభేదాలు రేపుతున్నారని అరికెపూడి మండిపడ్డారు. నన్ను ఆంధ్రావాడివి అంటూ సంబోధించారని.. తక్షణమే తనకు కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని అన్నారు. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వెంటనే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని అరికెపూడి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed