నాకు అహంకారం లేదు.. రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే: బండి సంజయ్

by Ramesh N |
Bandi Sanjay Responds On Choutuppal Wall Posters issue
X

దిశ, డైనమిక్ బ్యూరో: నాకు అహంకారం లేదు.. అని బీజేపీ నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కష్టాలు నుంచి బయటకు తెచ్చే బాధ్యత నాది.. అని భరోసా ఇచ్చారు. సోమవారం ఆయన సిరిసిల్ల పర్యటనలో భాగంగా పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండప అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు తన గెలుపునకు సహకరించారని చెప్పారు. రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల వరకే అని అన్నారు. విమర్శలకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి ఉంటుందన్నారు.

అన్ని కుల సంఘాల వారికి ధైర్యం వచ్చిందని, రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఎంపీ నిధులతో అన్ని కుల సంఘాలకు కుల భవనాలు ఇస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజల వారికి అండగా ఉన్నప్పుడే కుల సంఘాలకు విలువ ఉంటుందన్నారు. నిధులను అందరికీ ఉపయోగపడేలా చూడాలని, అందరికీ ఉపయోగపడే వాటికి ఎంపీ నిధులు ఇస్తున్నామన్నారు. ఓట్ల కోసం నిధులు దుర్వినియోగం చేయకూడని మోడీ చెప్పారని గుర్తు చేశారు. అన్ని కులాలను సమానంగా చూస్తా, నిధులు ఇస్తానని అన్నారు. 2 లక్షల 25 మెజారిటీ తో గెలిపిస్తే మోడీ తనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. కరీంనగర్‌ను అన్ని విధాల అభివృద్ధికి కృషి చేస్తానని, అనేక పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దేశాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాల అభివృద్ధి చెందాలన్నారు.

గురుకుల విద్యాలయాల టైం టేబుల్ మార్చాలి

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఉద్యోగుల కామన్ టైమ్ టేబుల్‌లో మార్పులు చేయాలని, కరీంనగర్ జిల్లాలోని పోలీసుల టీఏ, డీఏ, పిఆర్సీ బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. గురుకుల పాఠశాలల రోజువారీ షెడ్యూల్ ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు మార్చబడిందన్నారు. ఈ కొత్త కామన్ టైమ్ టేబుల్ అమలుతో గురుకుల టీచర్లు, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో పిల్లలకు అల్పాహారం, రాత్రి భోజనం, క్రీడలు, వ్యాయామాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖ్యంగా నిద్రించడానికి తగినంత సమయం దొరకదన్నారు.

దీనివల్ల టీచర్లు, విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా టీచర్లు రాత్రిపూట విధులు నిర్వహించుకొని తిరిగి వెళ్లే క్రమంలో నరకయాతన అనుభవిస్తున్నారని వెల్లడించారు. మరోవైపు గురుకుల పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని, టీచర్లపై పనిభారం, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని లేఖలో పేర్కొన్నారు. తక్షణమే గురుకుల టీచర్లను నాన్ టీచింగ్ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిన అవసరం ఉందని, అలాగే వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

Advertisement

Next Story