- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను అమాయకున్ని.. ఆ విషయం నాకు తెలియదు: Chikoti Praveen
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్యాంబ్లింగ్ కేసులో పటాయా పోలీసులకు పట్టుబడ్డ చీకోటి ప్రవీణ్ కుమార్ తాను అమాయకున్ని అని చెప్పుకొన్నారు. నాలుగు రోజుల పోకర్ టోర్నమెంట్ అని దేవ్, సీతల నుంచి అందిన ఆహ్వానం మేరకే హోటల్‌కు వెళ్లినట్టు చెప్పారు. తాను వెళ్లిన పది నిమిషాలకే పోలీస్ రైడ్ జరిగిందని పేర్కొన్నారు. పటాయాలో ఓ తెలుగు ఛానల్ ప్రతినిధితో చీకోటి మాట్లాడారు. పోకర్ కూడా పటాయాలో లీగల్ కాదు కదా అన్న ప్రశ్నకు ఆ విషయం తనకు తెలియదన్నారు.
దేవ్, సీతలు పంపిన ఇన్విటేషన్‌పై స్టాంపులు వేసి ఉన్నాయని చెప్పారు. అవి చూసే హోటల్‌కు వెళ్ళానన్నారు. అంతకుముందు పటాయాలోనే వేరే ప్రాంతంలో ఉన్నట్టు తెలిపారు. తాను ఆర్గనైజర్ కాదని స్పష్టం చేశారు. అందుకే కోర్టు జరిమానా విధించి బెయిల్ ఇచ్చిందని తెలిపారు. తాను ఇల్లీగల్ క్యాసినో నడపను అని అన్నారు. చీకోటి సహచరుడు మాధవ రెడ్డి కూడా దేవ్, సీతల ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లినట్టు చెప్పారు.
Read more: