- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Hydra: హైడ్రా భయమా..? మమ్మల్ని సంప్రదించండి.. వైరల్ గా మారిన వ్యాపార ప్రకటనలు
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా భయమా.. మమ్మల్ని సంప్రదించండి అంటూ కొందరు వ్యాపాస్థులు ప్రకటనలు ఇస్తున్నారు. హైడ్రా భయాన్ని బిజెనెస్ గా మలుచుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపార ప్రకటనకు సంబంధించిన ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. హైద్రాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, నాళాల పరిరక్షణ కోసం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఎఫ్టీఎల్ జోన్ లో భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేసి, ఆ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. దీంతో ఆక్రమణదారుల్లో హైడ్రా భయం మొదలైంది.
దీన్నే కొందరు వ్యాపారస్థులు బిజినెస్ స్ట్రాటజీగా ఉపయోగించుకుంటున్నారు. హైడ్రా భయమా..? మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి అని కంటైనర్ వ్యాపారస్థులు ప్రకటనలు ఇస్తున్నారు. కంటైనర్లలో ఇంటిని నిర్మించుకుంటే హైడ్రాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించుకోవచ్చని ప్రకటనల్లో పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంటైనర్ వ్యాపారస్థుల బిజినెస్ స్ట్రాటజీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీనిపై కొందరి భయం.. మరికొందరికి బిజినెస్ గా మారిందని ఓ నెటిజన్ అనగా.. రైట్ టైం లో, రైట్ బిజినెస్ అంటే ఇదేనేమోనని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.