HYDRA: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ‘హైడ్రా’కు మరో కీలక బాధ్యత అప్పగింత!

by Shiva |   ( Updated:2024-09-11 08:42:15.0  )
HYDRA: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ‘హైడ్రా’కు మరో కీలక బాధ్యత అప్పగింత!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతే ధ్యేయంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వరుసగా కూల్చివేతలు చేపడుతూ విమర్శకుల నోళ్లను మూయిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే బిల్డింగ్ పర్మీషన్ల ప్రక్రియనులోనూ ‘హైడ్రా’ చేర్చేందుకు నిర్ణయించారని సమాచారం. ఇక నుంచి నగరంలో ఎక్కడైనా ఇళ్లు కట్టాలంటే ‘హైడ్రా’ నుంచి ఎన్‌వోసీ (NOC) ఇస్తేనే నిర్మాణాలకు అనుమతులు వచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇక ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ‘హైడ్రా’ కళ్లుగప్పి ఎవరైనా అక్రమ నిర్మాణాలను చేపడితే ఆ ఇంటి నంబర్, నల్లా, కరెంట్ కనెక్షన్లను తొలగించనున్నట్లుగా తెలుస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు నష్ట పోకుండా ఉండేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా టాక్. అందుకు సంబంధించి అఫీషియల్‌గా న్యూస్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed