HYDRA: కూల్చివేతలపై ‘హైడ్రా’ కమిషనర్ సంచలన ప్రకటన

by Shiva |
HYDRA: కూల్చివేతలపై ‘హైడ్రా’ కమిషనర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పెల్లుబికిన ప్రజాగ్రహంతో ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) యూటర్న్ తీసుకుందని, నిన్నటి వరకు తగ్గేదే అంటూ బుల్డోజర్లతో గర్జించిన ఆ సంస్థ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిందంటూ వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్నాయి. ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్లు (Buffer Zones) అంటూ భయపెట్టిన ‘హైడ్రా’ (HDYRA) వెనక్కి తగ్గిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే ‘హైడ్రా’ కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేతల విషయంలో హైడ్రా ఎలాంటి యూటర్న్, బ్యాక్ టర్న్ తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారమే తమ సంస్థ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. 2024 జూలైకి ముందుకు పర్మీషన్లు ఉన్న ఇళ్లను కూల్చబోమని స్పష్టం చేశారు. ఒక వేళ ప్రభుత్వం అన్ని ఇళ్లను కూల్చదలుచుకుంటే లక్షలాది ఇళ్లను తాము కూల్చాల్సి ఉంటుందని అన్నారు. హైడ్రా (HYDRA) ఏర్పాటైన తరువాత అనుభవాలతో కొన్ని పాలసీలను మార్చుకున్నామని తెలిపారు. ఏ విషయంలోనైనా అనుభవాల నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిందేనని రంగనాథ్ పేర్కొన్నారు.

Advertisement

Next Story