Telangana weather update:: హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తివేత.. మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2750 క్యూసెక్కుల నీటి విడుదల

by Mahesh |   ( Updated:2023-07-25 06:06:58.0  )
Telangana weather update:: హిమాయత్ సాగర్ మరో రెండు గేట్లు ఎత్తివేత.. మొత్తం నాలుగు గేట్ల ద్వారా 2750 క్యూసెక్కుల నీటి విడుదల
X

దిశ సిటీ బ్యూరో: మహా నగర వాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ రిజర్వాయర్ మరో రెండు గేట్లను అధికారులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు గేట్లు రెండు అడుగుల ఎత్తు మేరకు ఎత్తిన అధికారులు మరో రెండు గేట్లను మంగళవారం ఉదయం 8 గంటలకు ఎత్తి దిగువకు 2750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1761.75 అడుగులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి ::వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ : అవసరమైతే తప్ప బయటకు రావొద్దు, చెట్ల కింద ఉండొద్దుంటూ సూచన

Advertisement

Next Story