- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేది ఎప్పుడో తెలుసా..
దిశ, జూబ్లిహిల్స్ : కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో విష్ణు వర్ధన్ చేరతారని, త్వరలోనే తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరికకు విష్ణువర్ధన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విష్ణు కలిశారు. మంత్రి హరీష్ రావు విష్ణును కలిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌లో చేరాలని విష్ణును కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని విష్ణు బాధపడ్డారని, తాము, విష్ణు కలిసి ఐదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని తెలిపారు.
అనేక ఉద్యమాల్లో విష్ణు తమతో కలిసి పోరాడారని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు విష్ణు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరికిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని.. సీట్లు అమ్ముకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగుంటుంది అనేది జనాలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణ వాదులకు తెలంగాణ ద్రోహులకు మధ్య జరుతుగున్న పోటీ అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనపడుతోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.