- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కెమెరా లెన్స్ చోరీ కేసులో ఇద్దరి అరెస్టు..
దిశ,కార్వాన్ : ట్రై కమిషనరేట్ల పరిధిలో కెమెరాల లెన్స్ ల చోరీకి పాల్పడుతున్న ఇద్దరిని గుడిమల్కాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఏసీపీ మునవర్ అలీ,ఇన్స్పెక్టర్ రాజు కథనం ప్రకారం.. కార్వాన్ ప్రాంతంలో ఉండే జి ప్రవీణ్ కుమార్, హైదర్ గూడ పాండురంగ నగర్ లో ఉండే బిక్షపతి ఇద్దరూ ఫోటోగ్రాఫర్లు, అయితే, వీరిద్దరు కలిసి మూడు కమిషనరేట్ల పరిధిలో పలు కంపెనీల బ్రాండెడ్ కెమెరాల లెన్స్లు అపహరించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హౌస్ ఫంక్షన్ హాలులో ఈనెల 7న సాయంత్రం అంబర్ పేట ప్రాంతానికి చెందిన బిజ్జి ఆదిత్య శుభకార్యంలో ఫొటోలు తీస్తుండగా నిందితులు ఇద్దరు అతడికి చెందిన రూ. 70 వేలు విలువ చేసే సోనీ కంపెనీకి చెందిన 24-105 లెన్సు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నిందితులు చోరీ చేసిన ఓ బైకుపై వెళ్తుండగా పోలీసులు మొఘల్ కానాలా ప్రాంతంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనానికి సంబంధించిన పత్రాలను అడుగగా పారిపోయే యత్నం చేయగా అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టగా కెమెరాల చోరీ విషయం వెలుగు చూసింది. వీరు గుడిమల్కాపూర్, కుల్సుంపుర, అత్తాపూర్, మీర్పేట, మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వీరి నుంచి బైకుతోపాటు 500 ఎంఎం సిగ్మా 85 ఎంఎం లెన్స్, సిగ్మా కంపెనీ కెమెరా 86 ఎంఎం ఎర్స్. గోడెక్స్ కంపెనీ ఫ్లాష్ కిట్, విట్రోక్స్ కంపెనీ పరికరం, తామ్రాన్ కెమెరా, సోనీ కెమెరా, సోనీ 24 టు 105 కెమెరా లెన్స్ స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులను సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ అభినందించారు.