ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..

by Sumithra |   ( Updated:2023-10-20 13:07:57.0  )
ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..
X

దిశ, చంపాపేట్ : రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ రీజియన్ లక్కీడీప్ స్కీంను ప్రవేశపెట్టినట్లు హయతనగర్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుచరిత శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ లక్కీ డిప్ స్కీంను ఉప్పల్ రోడ్డు, హయత్ నగర్ బస్ స్టాండ్, మిధాని బస్ స్టాండ్, ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్, వివిధ బస్ స్టాండ్ లో ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు వివరించారు.

బస్సులో ప్రయాణం పూర్తిచేసుకున్న ప్రయాణికులు టికెట్టు వెనుక భాగంలో పేరు, ఫోన్ నెంబర్ రాసి మహిళలు, పురుషుల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లో వేయాలని ప్రయాణికులకు సూచించారు. ప్రతి రీజియన్ నుండి ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషుల చొప్పున మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9,900 నగదు బహుమతులను అందించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Advertisement

Next Story