- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ, ఈడీలకు భయపడే ప్రసక్తే లేదు.. MLC Kavitha
దిశ, వెబ్ డెస్క్: మోడీ, ఈడీలకు భయపడే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కవిత పేరును ప్రస్తావించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, మోడీలపై మండిపడ్డారు. మోడీ 8 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ప్రభుత్వం కూలగొట్టిందని విమర్శించారు. రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన మోడీ కంటే ముందు ఈడీ రావడం కామన్ అని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ కుట్రలు పన్నుతోందని చెప్పారు.
అందులో భాగంగానే తనపై, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇది రాష్ట్రంలో రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వేసిన ఎత్తుగడ అని, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మీడియాకు లీకులిచ్చి తన ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ, మోడీ ఇలాంటి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని అన్నారు.